తారకరత్నకు ముగిసిన 48 గంటల అబ్జర్వేషన్

తారకరత్నకు ముగిసిన 48 గంటల అబ్జర్వేషన్
  • ఇటీవల కుప్పంలో గుండెపోటుకు గురైన తారకరత్న
  • ప్రస్తుతం బెంగళూరులో నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స
  • ఇంకా వెంటిలేటర్ పైనే తారకరత్న
  • నేడు బులెటిన్ విడుదల చేసే అవకాశం
నందమూరి తారకరత్న కుప్పంలో గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. కాగా, తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ల 48 గంటల అబ్జర్వేషన్ పీరియడ్ ముగిసింది. తారకరత్నకు ప్రస్తుతానికి ప్రాణాపాయం ఏమీ లేనప్పటికీ, నేడు అన్నిరకాల హృదయ సంబంధ ఆరోగ్య పరీక్షలను మరోసారి నిర్వహించనున్నారు. 

తారకరత్న ప్రస్తుతం వెంటిలేటర్ పైనే శ్వాస తీసుకుంటున్నారు.  తారకరత్న తాజా ఆరోగ్య పరిస్థితిపై బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యులు నేడు బులెటిన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.


More Telugu News