నన్ను చూసి రజనీ భయపడేవారు: అలనాటి నాయిక లత

  • 1970లలో గ్లామరస్ హీరోయిన్ గా లత
  •  ఎంజీఆర్ జోడీగా తొలి సినిమా ఛాన్స్
  •  అక్కినేని 'అందాలరాముడు'తో తెలుగు తెరకి పరిచయం
  • తాజాగా ఇంటర్వ్యూలో అలనాటి ముచ్చట్లు
70వ దశకంలో వెండితెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో 'లత' ఒకరు. ఆనాటి గ్లామరస్ హీరోయిన్స్ లో ఆమె ఒకరు. అలాంటి లత తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. " నేను రాజవంశీకుల ఫ్యామిలీ నుంచి వచ్చాను. చిన్నతనంలోనే నాకు డాన్స్ నేర్పించారు .. యాక్టింగ్ అంటే చాలా ఇష్టంగా ఉండేది. నా ఫోటో చూసిన ఎంజీఆర్ గారు, తన సినిమాలో హీరోయిన్ పాత్రకోసం అడిగారు. 

"ఆయన జోడీగా ఐదేళ్ల పాటు నటించడానికి కాంట్రాక్ట్ చేసుకోవడం జరిగింది. అందువల్లనే నన్ను అందరూ కూడానా ఎంజీఆర్ లత అంటూ ఉంటారు. నా ఫస్టు హీరో ఆయన .. ఆయన లాస్ట్ హీరోయిన్ నేను. ఆ తరువాత ఆయన రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. ఆ తరువాత నేను రజనీకాంత్ తోను చేశాను .. మా ఇద్దరి గురించి గాసిప్స్ వచ్చాయిగానీ నేను పట్టించుకోలేదు" అన్నారు. 

నేను ఎంజీఆర్ హీరోయిన్ గా రావడం వలన నా ఎదురుగా కూర్చోవడానికీ .. మాట్లాడటానికి రజనీ భయపడేవాడు. ఆ తరువాత ఆయన ఆ విషయం చెబితే నేను నవ్వేశాను. ఏఎన్నార్ తో 'అందాలరాముడు' సినిమాతో  తెలుగు తెరకి పరిచయమయ్యాను. గోదావరి ఒడ్డున ఆ సినిమా షూటింగు ఎంతో సరదాగా జరిగింది" అంటూ చెప్పుకొచ్చారు.


More Telugu News