భోగాపురంలో ఒబెరాయ్ హోటల్స్‌కు 40 ఎకరాల కేటాయింపు!

  • మార్చిలో భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన!
  • దిబ్బలపాలెం, అన్నవరం సరిహద్దులో ‘ఒబెరాయ్’కు స్థలం కేటాయింపు
  • అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించిన ఒబెరాయ్ ప్రతినిధులు
భోగాపురం విమానాశ్రయం సమీపంలో ఒబెరాయ్ హోటల్‌కు ఏపీ టూరిజం శాఖ 40 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్టు తెలుస్తోంది. విమానాశ్రయం నిర్మించ తలపెట్టిన ప్రాంతానికి సమీపంలోని దిబ్బలపాలెం, అన్నవరం సరిహద్దులో ఈ భూమిని కేటాయించినట్టు సమాచారం. 

ఒబెరాయ్ సంస్థ సీఈవో, ఎండీ విక్రమ్ ఒబెరాయ్, కార్పొరేట్ వ్యవహారాల ప్రెసిడెంట్ రాజారామన్ శంకర్, చీఫ్ ఫైనాన్స్ అధికారి కల్లోల్ కుందు, విశాఖ కలెక్టర్ మల్లికార్జునరావు, ఆర్డీవో భాస్కరరెడ్డి, తహసీల్దార్ కోరాడ వేణుగోపాల్ తదితరులు నిన్న భోగాపురం సందర్శించి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. బీచ్ కారిడార్‌కు ఆనుకుని ఉండే అంశాలపై మ్యాప్‌లను పరిశీలించారు. అలాగే, భూమి ఎత్తుపల్లాలు, పర్యావరణ అనుకూలతలపై విశాఖ జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించారు. కాగా, భోగాపురం విమానాశ్రయానికి మార్చిలో శంకుస్థాపన జరిగే అవకాశం ఉంది.


More Telugu News