ఏఎస్సై కాల్పుల్లో గాయపడిన ఒడిశా మంత్రి కన్నుమూత

ఏఎస్సై కాల్పుల్లో గాయపడిన ఒడిశా మంత్రి కన్నుమూత
  • ఒడిశాలో మంత్రిపై కాల్పులు జరిపిన పోలీసు అధికారి
  • చికిత్స పొందుతూ మృతి చెందిన మంత్రి నబకిశోర్ దాస్
  • ఛాతీలో రెండు బుల్లెట్ గాయాలు
  • అపోలో ఆసుపత్రి వైద్యుల శ్రమ నిష్ఫలం
ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నబకిశోర్ దాస్ పై ఓ పోలీసు కాల్పులు జరపడం సంచలనం సృష్టించింది. గోపాలచంద్ర దాస్ అనే ఏఎస్సై జరిపిన కాల్పుల్లో మంత్రి తీవ్రంగా గాయపడ్డారు. ఆయను ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం దక్కలేదు. ఛాతీలో రెండు బుల్లెట్లు ఉండడంతో చికిత్స కష్టమైంది. పరిస్థితి విషమించడంతో మంత్రి నబకిశోర్ దాస్ కొద్దిసేపటి కిందట తుదిశ్వాస విడిచారు. 

ఝూర్సుగూడ జిల్లా బ్రిజ్ రాజ్ నగర్ లో ఈ ఘటన జరగ్గా, బుల్లెట్ గాయాలకు గురైన మంత్రి ఎయిర్ లిఫ్ట్ ద్వారా భువనేశ్వర్ తరలించారు. మంత్రి ప్రాణాలు కాపాడేందుకు భువనేశ్వర్ లోని అపోలో ఆసుపత్రి వైద్యులు తీవ్రంగా శ్రమించారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. 

అటు, కాల్పులు జరిపిన ఏఎస్ఐ గోపాలచంద్ర దాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల ఘటనపై ఒడిశా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.


More Telugu News