సీఎం జగన్ రెండ్రోజుల ఢిల్లీ పర్యటన ఖరారు

  • రేపు సాయంత్రం ఢిల్లీ బయల్దేరనున్న సీఎం జగన్
  • ఎల్లుండి పలు కార్యక్రమాలతో బిజీ
  • ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు
  • ఢిల్లీ లీలా ప్యాలెస్ హోటల్ లో దౌత్యవేత్తలతో సమావేశం
ఏపీ సీఎం జగన్ రెండ్రోజుల ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఆయన రేపు, ఎల్లుండి ఢిల్లీలో పర్యటించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరనున్నారు. సాయంత్రం 6.45 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు. 

ఈ నెల 31న దేశ రాజధానిలో జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరుకానున్నారు. ఢిల్లీ లీలా ప్యాలెస్ హోటల్ లో దౌత్యవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు.

కాగా, సీఎం జగన్ రేపు మధ్యాహ్నం వరకు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి 10.40 గంటలకు వినుకొండ చేరుకుంటారు. 

ఉదయం 11.05 గంటల నుంచి మధ్యాహ్నం 12.20 గంటల వరకు వినుకొండ వెల్లటూరు రోడ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు. జగనన్న చేదోడు వాదోడు పథకం లబ్దిదారుల ఖాతాలకు నగదు బదిలీ చేస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన అంతరం మధ్యాహ్నం 1.05 గంటలకు తిరుగు ప్రయాణమవుతారు. మధ్యాహ్నం 1.45 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.


More Telugu News