కళింగులు తమకు ప్రాధాన్యతనిచ్చే పార్టీ వైపు అడుగులు వేయాలి: స్పీకర్ తమ్మినేని సీతారాం
- విశాఖలో కళింగ ఆత్మీయ కుటుంబ కలయిక
- హాజరైన స్పీకర్ తమ్మినేని
- విశాఖ నార్త్ స్థానం కళింగులకు ఇవ్వాలన్న స్పీకర్
- కానీ అలా జరగట్లేదని వెల్లడి
విశాఖపట్నంలో నిర్వహించిన కళింగ ఆత్మీయ కుటుంబ కలయిక కార్యక్రమానికి ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కళింగులు తమకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ వైపు అడుగులు వేయాలని సూచించారు.
విశాఖ నార్త్ అసెంబ్లీ స్థానం కళింగులకు ఇవ్వాలని... కానీ అలా జరగట్లేదని అన్నారు. ఇక, తెలంగాణలో కళింగులకు రిజర్వేషన్ ఇబ్బంది వచ్చిందని, అక్కడ బీసీ-ఏ జాబితా నుంచి కళింగులను తొలగించారని తమ్మినేని వెల్లడించారు. కళింగులను బీసీ-ఏ నుంచి తొలగించడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తో మాట్లాడానని తెలిపారు. కళింగులకు రిజర్వేషన్ పై పోరాటం చేస్తామని అన్నారు.
ఏపీలో సీఎం జగన్ కళింగులకు ఒక ఎంపీ స్థానం, రెండు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారని గుర్తుచేశారు.