ఒడిశా ఆరోగ్య మంత్రిపై పోలీసు కాల్పులు.. పరిస్థితి విషమం

  • జార్సుగూడ జిల్లా బ్రజ్ రాజ్ నగర్ లో ఘటన
  • ఓ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన మంత్రి
  • సమీపం నుంచి రివాల్వర్ తో కాల్పులకు దిగిన ఏఎస్ఐ
ఒడిశా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, బీజేడీ సీనియర్ నేత నబా కిషోర్ దాస్ ఓ పోలీసు చేతిలో దాడికి గురయ్యారు. అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ మంత్రి పై కాల్పులకు దిగాడు. తీవ్రంగా గాయపడిన మంత్రిని వెంటనే హాస్పిటల్ కు తరలించారు. జార్సుగూడ జిల్లాలో బ్రజ్ రాజ్ నగర్ పట్టణంలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. 

ఓ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన మంత్రి కారు దిగుతున్న సమయంలో సమీపం నుంచి అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ ఐదారు రౌండ్ల కాల్పులు జరిపాడు. నిందితుడిని ఏఎస్ఐ గోపాల్ దాస్ గా గుర్తించారు. సొంత రివాల్వర్ తోనే అతడు కాల్పులకు పాల్పడ్డాడు. మంత్రిపై ఏఎస్ఐ ఎందుకు కాల్పులు జరిపాడన్నది ఇంకా తెలియలేదని బ్రజ్ రాజ్ నగర్ ఎస్ డీపీవో గుప్తేశ్వర్ బోయ్ తెలిపారు. మంత్రి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. 


More Telugu News