కరోనా చికిత్సకు ప్రపంచం పెట్టిన ఖర్చు తెలిస్తే గుండె గుభేల్​!

  • రూ. 30.38 లక్షల కోట్లు ఖర్చు చేసినట్టు అంచనా
  • కరోనా సమయంలో 810 శాతం పెరిగిన చికిత్స వ్యయం
  • అమెరికాలో  ఒక్కో వ్యక్తికి సగటున రూ. రూ.16.81 లక్షలు ఖర్చు
కరోనా మహమ్మారి రెండు మూడేళ్ల పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రళయం సృష్టించింది. వైరస్ కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతోమంది అనారోగ్యానికి గురయ్యారు. ఇప్పటికీ వైరస్ వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా పెనుభారాన్ని మోపింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ చికిత్సకు ఏకంగా రూ. 30.08 లక్షల కోట్లు ఖర్చు అయ్యాయి. ఈమేరకు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ఓ అధ్యయన నివేదికను వెల్లడించింది. కరోనా సమయంలో చికిత్స వ్యయం 810శాతం మేర పెరిగిందని తెలిపింది.

కరోనా సమయంలో ఆమెరికాలో అత్యధికంగా ఒక్కో వ్యక్తి సగటున రూ.16.81 లక్షలు ఖర్చు చేశారని ఈ నివేదిక పేర్కొంది. అత్యల్పంగా సోమాలియాలో రూ.733 ఖర్చు పెట్టారని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా సంభవించిన కొవిడ్‌ మరణాల్లో 27.2 శాతం భారత్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, నేపాల్‌, పాకిస్థాన్‌లలోనే చోటుచేసుకున్నాయని తెలిపింది. ఈ సమయంలో భారత పౌరులు ఆరోగ్యంపై పెట్టిన తలసరి ఖర్చు సగటు రూ.5678 కాగా, ప్రభుత్వం పెట్టిన ఖర్చు సగటు రూ.2706గా ఉంది. భారత్‌లో ఒక్కో వ్యక్తి తన ఆరోగ్యానికి పెట్టే సగటు ఖర్చు 2026 నాటికి రూ.7626కు చేరే అవకాశం ఉందని ఈ నివేదిక పేర్కొన్నది.


More Telugu News