మళ్లీ వస్తున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్
- మూడేళ్ల అనంతరం మళ్లీ సీసీఎల్
- గతంలో కరోనా కారణంగా నిలిచిన లీగ్
- ఈసారి 8 జట్లతో మ్యాచ్ లు
- తెలుగు వారియర్స్ జట్టుకు అఖిల్ అక్కినేని కెప్టెన్సీ
- మెంటార్ గా విక్టరీ వెంకటేశ్
గతంలో చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) పేరిట సందడి చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఐపీఎల్ స్ఫూర్తితో ఈ లీగ్ కు రూపకల్పన చేశారు. కరోనా వ్యాప్తి కారణంగా ఈ లీగ్ కు బ్రేక్ పడింది. మళ్లీ మూడేళ్ల తర్వాత సీసీఎస్ తెరపైకి వచ్చింది. ఫిబ్రవరి 18న సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ ప్రారంభం కానుంది. దేశంలోని వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన 8 జట్లు ఈ లీగ్ లో పాల్గొంటున్నాయి. నెల రోజుల పాటు ఈ టోర్నీ జరగనుంది. హైదరాబాద్, బెంగళూరు, జైపూర్, తిరువనంతపురం, జోథ్ పూర్ నగరాల్లో సీసీఎల్ మ్యాచ్ లు నిర్వహించనున్నారు.
సీసీఎల్ జట్ల వివరాలు...
1. తెలుగు వారియర్స్- అఖిల్ అక్కినేని (కెప్టెన్)
2. కర్ణాటక బుల్డోజర్స్- కిచ్చ సుదీప్
3. చెన్నై రైనోస్- ఆర్య
4. కేరళ స్ట్రయికర్స్- కుంచాకో బోబన్
5. ముంబయి హీరోస్- రితేశ్ దేశ్ ముఖ్
6. పంజాబ్ దే షేర్స్- సోనూ సూద్
7. బెంగాల్ టైగర్స్- జిషు సేన్ గుప్తా
8. భోజ్ పురి దబాంగ్స్- మనోజ్ తివారీ
సీసీఎల్ జట్ల వివరాలు...
1. తెలుగు వారియర్స్- అఖిల్ అక్కినేని (కెప్టెన్)
2. కర్ణాటక బుల్డోజర్స్- కిచ్చ సుదీప్
3. చెన్నై రైనోస్- ఆర్య
4. కేరళ స్ట్రయికర్స్- కుంచాకో బోబన్
5. ముంబయి హీరోస్- రితేశ్ దేశ్ ముఖ్
6. పంజాబ్ దే షేర్స్- సోనూ సూద్
7. బెంగాల్ టైగర్స్- జిషు సేన్ గుప్తా
8. భోజ్ పురి దబాంగ్స్- మనోజ్ తివారీ