'శాకుంతలం' నుంచి మరో బ్యూటిఫుల్ మెలోడీ!
- ప్రణయ కథా కావ్యంగా 'శాకుంతలం'
- గుణశేఖర్ చేసిన మరో ప్రయోగమే ఈ సినిమా
- హైలైట్ గా నిలవనున్న మణిశర్మ సంగీతం
- వచ్చేనెల 17వ తేదీన సినిమా రిలీజ్
గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రధారిగా 'శాకుంతలం' సినిమా రూపొందింది. కాళిదాసు రచించిన 'అభిజ్ఞాన శాకుంతలం' ఆధారంగా గుణశేఖర్ తన సొంత బ్యానర్లో ఈ సినిమాను నిర్మించారు. నిర్మాణ భాగస్వామిగా దిల్ రాజు ఉన్నారు. శకుంతలగా సమంత నటించిన ఈ సినిమాలో దుష్యంతుడిగా దేవ్ మోహన్ కనిపించనున్నాడు.
ఈ దృశ్యకావ్యాన్ని వచ్చేనెల 17వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక్కో పాటను వదులుతూ వస్తున్నారు. కొంతసేపటి క్రితం మరో బ్యూటిఫుల్ మెలోడీని రిలీజ్ చేశారు. 'రుషి వనంలోన స్వర్గధామం .. హిమవనంలోన అగ్నివర్షం .. ' అంటూ ఈ పాట మొదలవుతోంది.
శకుంతల .. దుష్యంతులా ప్రణయానికి సంబంధించిన నేపథ్యంలో వచ్చే పాట ఇది. శ్రీమణి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను, చిన్మయి శ్రీపాద - సిద్ శ్రీరామ్ ఆలపించారు. మణిశర్మ నుంచి వచ్చిన మరో మంచి మెలోడీ సాంగ్ గా దీనిని గురించి చెప్పుకోవచ్చు