సొంత ఖర్చుతో ప్రజలకు ‘ఆరోగ్య రక్ష’.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యక్రమం

  • ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని చేపట్టిన కోటంరెడ్డి
  • ఆరోగ్యశ్రీ వల్ల కొందరికే లబ్ధి కలుగుతోందన్న వైసీపీ ఎమ్మెల్యే
  • అన్ని రకాల వ్యాధులకు చికిత్స, మందులు అందిస్తున్నామని వెల్లడి
వైసీపీ నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పుడూ ఏదో రకంగా వార్తల్లో ఉంటారు. తాజాగా ఆయన చేపట్టిన ఓ కార్యక్రమం సొంత పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వంతో సంబంధం లేకుండా తన సొంత ఖర్చులతో ప్రజలకు వైద్య సేవలను అందించే కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. ఈ కార్యక్రమానికి 'ఆరోగ్య రక్ష' అని ఆయన పేరు పెట్టారు. ప్రభుత్వ పథకం ఆరోగ్యశ్రీ ఉండగా... ఆయన ఆరోగ్య రక్ష పేరుతో సొంత కార్యక్రమాన్ని ఆసక్తికరంగా మారింది. 

ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ... ఆరోగ్యశ్రీ వల్ల కొందరికి మాత్రమే లబ్ధి చేకూరుతోందని... తన కార్యక్రమం ద్వారా అన్ని రకాల వ్యాధులకు చికిత్స, మందులు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం కోసం కొందరు కార్పొరేట్ ఆసుపత్రులు, నిపుణులైన డాక్టర్ల సాయం తీసుకుంటున్నామని తెలిపారు. నెల్లూరులోని 6 ఆసుపత్రులకు చెందిన 33 మంది వైద్యులు, రెండు సామాజిక సేవా సంస్థలు భాగస్వాములు అయ్యాయని చెప్పారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనేదే తన లక్ష్యమని, ఈ కార్యక్రమం ద్వారా తాను ఎలాంటి రాజకీయ ప్రయోజనాలను ఆశించడం లేదని తెలిపారు.


More Telugu News