ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచారంటూ ప్రచారం.. ఖండించిన అధికారులు
- 62 నుంచి 65 ఏళ్లకు పెంచారని ప్రచారం
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జీవో
- అలాంటిదేమీ లేదని అధికారుల వివరణ
- తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచారంటూ ప్రచారం జరుగుతోంది. ఈమేరకు ఓ జీవో ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడున్న 62 ఏళ్ల వయసు నుంచి 65 ఏళ్ల కు రిటైర్మెంట్ ఏజ్ పెంచారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అయితే, అలాంటి జీవో ఏదీ ప్రభుత్వం జారీ చేయలేదని అధికారులు వివరణ ఇచ్చారు. పదవీ విరమణ వయసు పెంపు వార్తలు తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. ఇలాంటి వార్తలను నమ్మొద్దని, సోషల్ మీడియాలో పార్వార్డ్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పదవీ విరమణ వయసు పెంచారన్న ప్రచారం ఎలా మొదలైందో నిగ్గుతేల్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు చెప్పారు. దీనిపై గుంటూరు డీఐజీకి ఆర్థిక శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేయాలని ఎస్పీని డీఐజీ ఆదేశించారు. గతంలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును జగన్ సర్కారు పెంచిన విషయం తెలిసిందే. గతంలో 60 ఏళ్లుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 2022 జనవరి 1 నుంచి 62 ఏళ్లకు ప్రభుత్వం పెంచింది.