టీ20ల్లో చెత్త రికార్డు మూటగట్టుకున్న అర్ష్ దీప్ సింగ్
- పొట్టి ఫార్మాట్ లో అత్యధిక నో బాల్స్ వేసిన బౌలర్ గా నిలిచిన వైనం
- న్యూజిలాండ్ తో తొలి టీ20 చివరి ఓవర్లో 27 పరుగులు ఇచ్చిన పేసర్
- 21 పరుగుల తేడాతో ఓడిపోయిన భారత్
న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత్ టీ20 సిరీస్ ను మాత్రం పేలవంగా ఆరంభించింది. రాంచీలో శుక్రవారం రాత్రి జరిగిన తొలి టీ20లో 21 పరుగుల తేడాతో చిత్తయింది. ఈ మ్యాచ్ లో భారత ఓటమికి యువ బౌలర్ అర్ష్ దీప్ సింగ్ కారణమని విమర్శకులు, నెటిజన్లు అతనిపై దుమ్మెత్తిపోస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో చివరి ఓవర్ వేసిన అర్ష్ దీప్ ఏకంగా 27 పరుగులు ఇవ్వడమే అందుకు కారణమైంది. అంతేకాదు తను ఓ చెత్త రికార్డును కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఆఖరి ఓవర్ తొలి బంతికి అతను నో బాల్ వేశాడు. దాంతో, అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక నో బాల్స్ వేసిన బౌలర్ గా నిలిచాడు. ఇప్పటిదాకా 22 మ్యాచ్ ల్లో అతను 14 నో బాల్స్ వేశాడు. పాకిస్థాన్ కు చెందిన హసన్ అలీ 11 నో బాల్స్ తో రెండో స్థానంలో ఉన్నాడు.