కుప్పకూలిన 3 యుద్ధ విమానాలు.. మధ్యప్రదేశ్ లో రెండు.. రాజస్థాన్ లో ఒకటి
- శిక్షణ విమానాలు ఢీ కొని నేలకూలిన వైనం
- కొనసాగుతున్న సహాయక చర్యలు.. పైలట్లు క్షేమం
- రాజస్థాన్ లో కూలిన ఎయిర్ ఫోర్స్ విమానం
మధ్యప్రదేశ్ లో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శిక్షణ విమానాలు ఒకదానిని మరొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో యుద్ధ విమానాలు రెండూ నేల కూలాయి. గ్వాలియర్ లో పైలట్లకు యుద్ధ విమానాలను నడపడంలో ఉన్నతాధికారులు శిక్షణ ఇస్తున్నారు. ఈ క్రమంలో సుఖోయ్ - 30, మిరాజ్ -2000 విమానాలతో పైలట్లు శిక్షణ అభ్యాసాలు చేస్తున్నారు. ప్రమాదవశాత్తూ ఈ రెండు విమానాలు ఢీ కొని నేలకూలాయి.
ఆపై మంటల్లో చిక్కుకోవడంతో రెస్క్యూ సిబ్బంది వెంటనే స్పందించారు. సహాయక చర్యలు చేపట్టారని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదని సమాచారం. రాజస్థాన్ లో జరిగిన మరో ప్రమాదంలో భారత వైమానిక దళానికి చెందిన విమానం ఒకటి కూలిపోయింది. భరత్ పూర్ లో ఐఏఎఫ్ విమానం నేలకూలినట్లు జిల్లా కలెక్టర్ ధ్రువీకరించారు. సాంకేతిక సమస్య కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టామని ఆయన వివరించారు. ఈ ప్రమాదంలో పైలట్ క్షేమంగా బయటపడినట్లు తెలుస్తోంది.