ఝార్ఖండ్ లో విషాదం.. సొంత ఆసుపత్రిలోనే కాలిబూడిదైన డాక్టర్ దంపతులు
- ఝార్ఖండ్ రాష్ట్రంలోని దన్ బాద్ లో ఘటన
- హాస్పిటల్ రెండో అంతస్తులో షార్ట్ సర్క్యూట్
- మొదటి అంతస్తులోని వారు బయటపడలేక దుర్మరణం
ఝార్ఖండ్ రాష్ట్రంలోని దన్ బాద్ లో విషాదం చోటు చేసుకుంది. హజ్ర హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం వాటిల్లగా.. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ హాస్పిటల్ ను ఏర్పాటు చేసిన వైద్య దంపతులు డాక్టర్ వికాస్ హజ్ర, డాక్టర్ ప్రేమ హజ్ర కూడా మంటల్లో చిక్కుకుని ప్రాణాలు విడిచారు. మిగిలిన వారు హాస్పిటల్ ఉద్యోగులుగా గుర్తించారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా హాస్పిటల్ భవనం రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. అక్కడి నుంచి వేగంగా మొదటి అంతస్తును చుట్టేశాయి. అదే అంతస్తులో నిద్రలో ఉన్న వైద్య దంపతులు, ఇతర ఉద్యోగులు బయటపడలేకపోయారు. పొగకు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు వెల్లడించారు.
హాస్పిటల్ లో అగ్ని ప్రమాద నివారణకు సరైన ఏర్పాట్లు లేవని అగ్నిమాపక సిబ్బంది ప్రకటించారు. సమాచారం అందుకున్న వెంటనే వారు ప్రమాద స్థలానికి చేరుకుని 9 మందిని రక్షించి పాటలీపుత్ర ఆసుపత్రికి తరలించారు.