కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది: సీఎం కేసీఆర్
- దేశ భవిష్యత్ కోసమే బీఆర్ఎస్ అని వెల్లడి
- చైనా కంటే భారత్ సంపదే ఎక్కువన్న కేసీఆర్
- కానీ అభివృద్ధిలో చైనానే ముందుందని వివరణ
బీఆర్ఎస్ పార్టీ స్థాపించి జాతీయస్థాయిలో చక్రం తిప్పాలని ఆశిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయపరమైన విమర్శలు చేశారు. దేశ భవిష్యత్ కోసమే బీఆర్ఎస్ పార్టీ అని స్పష్టం చేశారు. చైనా కంటే కూడా మనదేశ సంపదే ఎక్కువని... కానీ అమెరికా, చైనా అభివృద్ధిలో ఏ స్థాయిలో ఉన్నాయి? మనదేశం ఏ స్థాయిలో ఉంది? అని ప్రశ్నించారు.
భారత్ లో 75 ఏళ్ల తర్వాత కూడా తాగేందుకు మంచినీరు అందించలేకపోతున్నామని, దేశంలో సాగునీరు కూడా పూర్తిస్థాయిలో అందడంలేదని తెలిపారు. ఈ 75 ఏళ్లలో మనం ఏం సాధించినట్టు? అని వ్యాఖ్యానించారు. కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారిందని అన్నారు. జాతి, ధర్మం పేరు చెప్పి ఓట్లు అడిగేవాళ్లు గెలిచిన తర్వాత ఏంచేస్తారని ప్రశ్నించారు.
ఒడిశాలో ఎన్ని నదులు ఉన్నా ఇంకా తాగునీరు అందుబాటులో లేదని తెలిపారు. రైతులు ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? రైతులు చట్టసభలకు ప్రాతినిధ్యం వహించాలని సీఎం కేసీఆర్ అభిలషించారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేవని, గతంలో వలస వెళ్లినవారు రాష్ట్రానికి తిరిగి వస్తున్నారని వెల్లడించారు.