రవితేజ ఇల్లు ఎన్ని కోట్లు అంటే ..!
- రవితేజ గురించిన ప్రస్తావించిన కేరక్టర్ ఆర్టిస్ట్ కమల్
- సిటీలో త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ ఉంటే చాలనుకున్న రవితేజ
- ఆయన ఇల్లు 12 కోట్లు ఉంటుందని కమల్ వెల్లడి
- రవితేజ కష్టపడి ఈ స్థాయికి వచ్చాడని హర్షం
చిరంజీవి తరువాత ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా వచ్చి హీరోగా ఎదిగినవారిలో రవితేజ కనిపిస్తాడు. అలాంటి రవితేజ గురించి తాజా ఇంటర్వ్యూలో కమల్ ('సీతారామయ్యగారి మనవరాలు' ఫేమ్) ప్రస్తావించాడు. రవితేజ హీరో కావడానికి ముందునుంచే నాకు పరిచయం. అప్పుడు తను కాస్త నల్లగా .. లావుగా ఉండేవాడు. ఆ తరువాత తనని తాను మార్చుకుంటూ వచ్చాడు" అని అన్నాడు.
"అప్పుడు కూడా ఆయన ఇదే ఎనర్జీతో ఉండేవాడు .. ఎక్కువగా బయటికి వచ్చేవాడు కాదు .. బయటకి ఏం పని? అని అడిగేవాడు. క్రమం తప్పకుండా జిమ్ చేసేవాడు. 'హైదరాబాద్ లో త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ ఉంటే చాలనుకుని వచ్చాను .. ఆ తరువాత వచ్చిందంతా బోనస్' అని ఆయన నాతో అన్నాడు. అలాంటి రవితేజ ఈ రోజున 12 కోట్ల ఖరీదు చేసే ఇంట్లో ఉంటున్నాడు" అని చెప్పాడు.
"అప్పట్లో రవితేజ తార్నాక నుంచి బంజారా హిల్స్ కి యమహాపై డైలీ వచ్చేవాడు. 'నిన్నే పెళ్లాడుతా' సినిమాకి కృష్ణవంశీ దగ్గర తాను అసిస్టెంట్ డైరెక్టర్. తాను హీరో అవుతానని కూడా ఆయన ఏ రోజునా అనుకోలేదు. అందువలన డైరెక్షన్ సైడ్ వెళ్లాడు. కృష్ణవంశీ ఇచ్చిన చిన్న వేషం ఆయన లైఫ్ ను మార్చేసింది. అప్పటి నుంచి రవితేజ కృషి చేస్తూనే ఈ స్థాయికి వచ్చాడు" అని అన్నాడు.