అవసరమైతే తారకరత్నను హెలికాప్టర్ లో బెంగళూరుకు తరలిస్తాం: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
- లోకేశ్ పాదయాత్ర సందర్భంగా తారకరత్నకు తీవ్ర అస్వస్థత
- వెంటనే ఆసుపత్రికి తరలింపు
- పరిస్థితి ఇంకా విషమంగానే ఉందన్న గోరంట్ల
- యాంజియోగ్రామ్ పూర్తయిందని వెల్లడి
- స్టెంట్లు వేయలేదని స్పష్టీకరణ
కుప్పంలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా నందమూరి తారకరత్న గుండెపోటుకు గురవడం తెలిసిందే. కుప్పం మసీదులో లోకేశ్ తో పాటు ప్రార్థనల్లో పాల్గొన్న తారకరత్న, మసీదు నుంచి వెలుపలికి వస్తుండగా తీవ్ర అస్వస్థతతో కుప్పకూలిపోయారు. దాంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు.
తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వెల్లడించారు. రక్తనాళాల్లో బ్లాక్స్ ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. అందువల్లే స్ట్రోక్ వచ్చిందని డాక్టర్లు చెప్పారని వివరించారు. ప్రస్తుతానికి తారకరత్నకు యాంజియోగ్రామ్ చేశారని, స్టెంట్లు వేయలేదని స్పష్టం చేశారు. అవసరమైతే హెలికాప్టర్ లో బెంగళూరు తరలిస్తామని గోరంట్ల పేర్కొన్నారు.