ఆసుపత్రికి వచ్చే సమయానికి తారకరత్న పల్స్ పూర్తిగా పడిపోయిందన్న వైద్యులు!
- యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న
- సొమ్మసిల్లి పడిపోయిన వైనం
- హుటాహుటీన కుప్పం ఆసుపత్రికి తరలింపు
- యాంజియోగ్రామ్ నిర్వహించి స్టెంట్ వేసిన వైద్యులు
- తారకరత్నను బెంగళూరు తరలించే అవకాశం
నందమూరి హీరో తారకరత్న ఇవాళ యువగళం పాదయాత్ర ప్రారంభం సందర్భంగా తీవ్ర అస్వస్థతకు గురికావడం తెలిసిందే. సొమ్మసిల్లి పడిపోయిన ఆయనను హుటాహుటీన కుప్పం ఆసుపత్రికి తరలించారు. ఆయనకు యాంజియోగ్రామ్ నిర్వహించి, స్టెంట్ వేసినట్టు తెలుస్తోంది. \
కాగా, తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు స్పందించారు. ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికి తారకరత్న పల్స్ పూర్తిగా పడిపోయిందని తెలిపారు. శరీరం రంగు కూడా నీలంగా మారిపోయిందని పేర్కొన్నారు. వెంటనే చికిత్స ప్రారంభించడంతో, 45 నిమిషాల తర్వాత పల్స్ అందిందని వెల్లడించారు. తారకరత్న కోలుకుంటారని భావిస్తున్నట్టు వారు తెలిపారు. తారకరత్నను మరింత మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించనున్నట్టు తెలుస్తోంది.