తమిళంలో ఎంఎస్ ధోనీ సినిమా.. పేరు ఖరారు

  • ధోనీ భార్య సాక్షి నిర్మాతగా ‘లెట్స్ గెట్ మ్యారీడ్’
  • రమేష్ తమిళమణి రచన, దర్శకత్వంలో రానున్న సినిమా
  • హరీష్ కల్యాణ్, ఇవాన, నదియా, యోగిబాబుకు అవకాశం
టీమిండియా మాజీ కెప్టెన్, ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ నిర్మాతగా మారబోతున్నాడు. అది కూడా తమిళ సినిమా తీయనుండడం ఆసక్తికరం. హరీష్ కల్యాణ్, ఇవాన, నదియా, యోగిబాబు ఇందులో నటించనుండగా, రమేష్ తమిళమణి దర్శకత్వం వహించనున్నారు. దీనిపై నేడు ప్రకటన వెలువడింది. కాకపోతే ధోనీ తన భార్య సాక్షి సింగ్ నిర్మాతగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  

ఈ సినిమాకి ‘లెట్స్ గెట్ మ్యారీడ్’ (ఎల్ జీఎం) పేరును ఖరారు చేశారు. ధోనీ ఎంటర్ టైన్ మెంట్ కింద తక్కువ బడ్జెట్ తో ఈ సినిమాను తీయనున్నారు. నిర్మాతగా ధోనీ భార్య సాక్షికి, దర్శకుడిగా రమేష్ తమిళమణికి ఈ సినిమా మొదటిది కావడం గమనార్హం. ధోనీ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో ఉన్న ట్విట్టర్ పేజీలో ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ను గమనించొచ్చు.


More Telugu News