కోకాకోలా నుంచి స్మార్ట్ ఫోన్!

  • కోలా ఫోన్ పేరిట ఫోన్ తీసుకువస్తున్న కోకాకోలా
  • ప్రముఖ మాన్యుఫాక్చరింగ్ సంస్థతో ఒప్పందం
  • రియల్ మీ సంస్థతో భాగస్వామ్యం అంటూ కథనాలు
కోకాకోలా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూత్ లో మాంచి ఫాలోయింగ్ ఉన్న కూల్ డ్రింక్స్ లో కోకాకోలా ఒకటి. ఆశ్చర్యకరమైన రీతిలో కోకాకోలా ఓ స్మార్ట్ ఫోన్ ను తీసుకువస్తోంది. త్వరలోనే కోకాకోలా స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి రానుంది. దీని పేరు కోలా ఫోన్. 

ఈ స్మార్ట్ ఫోన్ తయారీ కోసం కోకాకోలా ఓ మాన్యుఫాక్చరింగ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. చైనాకు చెందిన రియల్ మీ సంస్థ భాగస్వామ్యంలో కోకాకోలా ఈ ఫోన్ తీసుకువస్తున్నట్టు ప్రచారంలో ఉంది. అందుబాటులో ఉన్న చిత్రాల ప్రకారం కోలా ఫోన్ రియల్ మీ ఫోన్ల తరహాలోనే కనిపిస్తోంది. 

శీతల పానీయాల సంస్థలు స్మార్ట్ ఫోన్ తీసుకురావడం ఇదే ప్రథమం కాదు. కోకాకోలా ప్రత్యర్థి పెప్సీ పీ1 పేరిట గతంలోనే ఫోన్ తీసుకువచ్చింది. షెంజెన్ కూబే అనే సంస్థతో చేయి కలిపి పీ1 ఫోన్ కు రూపకల్పన చేసింది. అయితే కొన్నాళ్లతో ఈ ఫోన్ తయారీని పెప్సీ నిలిపివేసింది.


More Telugu News