పవన్ కు, కేఏ పాల్ కు ఏంటి తేడా?: మంత్రి బొత్స
- రిపబ్లిక్ డే ప్రసంగంలో వైసీపీ ప్రభుత్వంపై పవన్ ఫైర్
- ఏపీలో తనను ఎవడు అడ్డుకుంటాడో చూస్తానని వ్యాఖ్యలు
- ఎవరిని బెదిరిస్తారు? అంటూ బొత్స ఆగ్రహం
- రిపబ్లిక్ డే సందర్భంగా సన్నాసి మాటలెందుకని విమర్శలు
జనసేనాని పవన్ కల్యాణ్ రిపబ్లిక్ డే ప్రసంగంలో చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. గణతంత్ర దినోత్సవం నాడు ఎవరైనా పద్ధతిగా మాట్లాడతారని, కానీ సెలబ్రిటీ పార్టీ నేత సన్నాసి మాటలు మాట్లాడాడని బొత్స విమర్శించారు.
ఆ నేత పిచ్చెక్కినట్టు మాట్లాడుతుండడంతో, తాము కూడా మాట్లాడక తప్పడంలేదని వివరణ ఇచ్చారు. ఏమీ లేని ఆకు ఎగిరెగిరిపడుతుందని, ఇలాంటి భాష మాట్లాడుతూ భావితరాలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాడని బొత్స వ్యాఖ్యానించారు.
"పవన్ వద్ద బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టే పెద్ద వాహనం కొన్నాడు. తనను అడ్డుకుంటే కొడతా, ఉగ్రవాదిని అయిపోతా అంటున్నాడు... దమ్ముంటే ఆపాలంటున్నాడు... ఎవరిని బెదిరిస్తాడు? ఎవరిని కొడతాడు? అసలు నిన్నెందుకు ఆపుతాం, నిన్నెందుకు అడ్డుకుంటాం..." అని బొత్స అన్నారు.
"ఒకవేళ ఉగ్రవాది అయిపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. వైసీపీ ప్రభుత్వం అణగారిన వర్గాలకు అండగా నిలిస్తే పవన్ కల్యాణ్ కు ఎందుకు బాధ? పవన్ కు కేఏ పాల్ కు తేడా లేదు" అని బొత్స విమర్శించారు. వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా అని ఈ విధంగా మాట్లాడేస్తారా? ఇలాంటి వాళ్లను చూస్తుంటే రాజకీయాలపైనే విరక్తి కలుగుతోందని బొత్స వ్యాఖ్యానించారు.