ఏపీ ప్రభుత్వ పథకాలు భేష్... రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్
- నేడు భారత గణతంత్ర దినోత్సవం
- జాతీయ పతాకావిష్కరణ చేసిన బిశ్వభూషణ్ హరిచందన్
- ప్రభుత్వ పథకాలు పారదర్శక రీతిలో అమలవుతున్నాయని వెల్లడి
- రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసలు
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు. త్రివర్ణ పతాకం ఎగురవేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. ఏపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పథకాలు పారదర్శక రీతిలో అమలవుతున్నాయని వెల్లడించారు.
నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి జరిగిందని అన్నారు. జగనన్న గోరు ముద్ద పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం లభిస్తోందని తెలిపారు. విద్యార్థులు చదువుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సాయం అందిస్తోందని గవర్నర్ వివరించారు.
గవర్నర్ ప్రసంగం ముఖ్యాంశాలు...

- హైస్కూల్ విద్యార్థులకు ట్యాబ్ లు అందించాం.
- రాష్ట్రంలో 10 వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం.
- రాష్ట్రంలో 37 లక్షల మంది రైతులకు వైఎస్సార్ పంటల బీమా అమలు చేస్తున్నాం.
- రైతు కుటుంబాలకు ఏటా రూ.13,500 సాయం చేస్తున్నాం.
- వైఎస్సార్ పెన్షన్ కానుక ద్వారా అర్హులైన వారికి నెలకు రూ.2,750 సాయం అందిస్తున్నాం.
- వైఎస్సార్ ఆసరా కింద పేద మహిళలకు సంవత్సరానికి రూ.15 వేల ఆర్థికసాయం అందిస్తున్నాం.
- కాపునేస్తం ద్వారా ఇప్పటివరకు రూ.1,518 కోట్ల సాయం.