ప్రగతి భవన్ లో జాతీయ జెండాను ఎగురవేసిన కేసీఆర్

  • మహాత్మాగాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు నివాళి
  • పరేడ్ గ్రౌండ్ లో అమర జవానులకు నివాళి
  • కార్యక్రమంలో పాల్గొన్న సీఎస్, డీజీపీ, పలువురు మంత్రులు
భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. వీరిలో మంత్రులు మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి తదితరులు ఉన్నారు. 

ఈ సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు కేసీఆర్ పూలమాల వేసి నివాళి అర్పించారు. దీనికి ముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లోని అమర జవానుల స్తూపం వద్ద ఆయన నివాళి అర్పించారు. మరోవైపు రాజ్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కాలేదు.


More Telugu News