రాజ్ భవన్ లో గణతంత్ర వేడుకలకు కేసీఆర్ దూరం

  • జెండా ఆవిష్కరించిన గవర్నర్ తమిళిసై
  • హాజరు కాని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
  • ప్రభుత్వం తరఫున వేడుకల్లో పాల్గొన్న సీఎస్ శాంతికుమారి
తెలంగాణ రాజ్ భవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నా ప్రియమైన తెలంగాణ ప్రజలకు.. అంటూ తెలుగులో తమిళిసై ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రజలకు, వేడుకలకు హాజరైన అతిథులకు, సీనియర్ అధికారులకు, రాజ్ భవన్ సిబ్బందికి, మీడియా మిత్రులకు 74 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పారు.
 
ఇక రాజ్ భవన్ లో జరిగిన గణతంత్ర వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరుకాలేదు. గవర్నర్ తో విభేదాల కారణంగా అక్కడికి వెళ్లేందుకు ఆయన విముఖత వ్యక్తంచేశారని సమాచారం. ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కరోనా కారణంగా గతేడాది కూడా గణతంత్ర వేడుకలను రాజ్ భవన్ కే పరిమితం చేయగా.. అప్పుడు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వేడుకలకు హాజరుకాలేదు. కేబినెట్ మినిస్టర్లు కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.


More Telugu News