తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా లోకేశ్.. రేపటి నుంచే యువగళం పాదయాత్ర
- రేపటి నుంచే లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర
- లోకేశ్ రాకతో తిరుపతిలో కోలాహలం
- నేటి రాత్రికి కుప్పంలో బస
- రేపు వరదరాజులు దేవాలయంలో పూజల అనంతరం పాదయాత్ర ప్రారంభం
యువగళం పేరుతో పాదయాత్ర తలపెట్టిన టీడీపీ నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన రాక సందర్భంగా తిరుపతిలో కోలాహలం నెలకొంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తిరుపతి చేరుకున్నారు. తిరుమల స్వామి వారిని దర్శించుకున్న లోకేశ్.. కుప్పం చేరుకుని రాత్రికి ఆర్ అండ్ బీ అతిథిగృహంలో బస చేస్తారు.
రేపు మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం మునిసిపాలిటీ లక్ష్మీపురంలోని వరదరాజులు దేవాలయంలో పూజలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభిస్తారు. కమతమూరు రోడ్డులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం గుడుపల్లె మండలం శెట్టిపల్లి చేరుకుంటారు. రాత్రికి పీఈఎస్ మెడికల్ కాలేజీ ఎదుట ఉన్న ఓ ప్రైవేటు స్థలంలో లోకేశ్ బస చేస్తారు. రెండో రోజు అక్కడి నుంచి శాంతిపురం మండలంలోకి ప్రవేశిస్తారు.