కేటీఆర్ సీఎం కాడేమో అనే భయంతోనే..: కిషన్ రెడ్డి
- రిపబ్లిక్ డే నిర్వహణకు కూడా హైకోర్టును ఆశ్రయించాల్సిన దుస్థితి వచ్చిందన్న కిషన్ రెడ్డి
- కేసీఆర్ వల్ల తెలంగాణ పరువు పోతోందని విమర్శ
- కేసీఆర్ మాదిరి దిగజారుడు రాజకీయాలు ఎవరూ చేయలేదని వ్యాఖ్య
రిపబ్లిక్ డే ను నిర్వహించుకోవడానికి కూడా హైకోర్టును ఆశ్రయించాల్సిన దుస్థితి తెలంగాణలో నెలకొందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యల వల్ల దేశ వ్యాప్తంగా తెలంగాణ పరువు పోతోందని చెప్పారు. అధికారంలో ఎవరు ఉన్నా రాజ్యాంగబద్ధమైన నిబంధనలను పాటించాల్సిందేనని చెప్పారు. రాజ్యాంగేతర శక్తులకు రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు.
తన కుమారుడు కేటీఆర్ సీఎం అవ్వడేమో అనే భయంతోనే కేసీఆర్ ఘర్షణాత్మకమైన వైఖరిని అవలంబిస్తున్నారని విమర్శించారు. ఈ కారణం వల్లే ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్ కు శకటానికి సంబంధించిన ప్రపోజల్ ను కూడా పంపలేదని అన్నారు. దేశంలో ఎన్నోసార్లు గవర్నర్లకు, ముఖ్యమంత్రులకు అభిప్రాయ భేదాలు వచ్చాయని... కానీ, కేసీఆర్ మాదిరి ఎవరూ ఇంత దిగజారుడు రాజకీయాలు చేయలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో చాలా విచిత్రమైన రాజకీయాలు జరుగుతున్నాయని అన్నారు.