కృతిశెట్టిని కంగారు పెడుతున్న కొత్త బ్యూటీలు వీరే!

  • యూత్ లో కృతి శెట్టికి మంచి క్రేజ్
  • కొంతకాలంగా వెంటాడుతున్న ఫ్లాపులు
  • చేతిలో పెద్దగా లేని ప్రాజెక్టులు 
  • కొత్త హీరోయిన్స్ తో పెరుగుతున్న పోటీ 
కృతి శెట్టి .. బందరు లడ్డూ లాంటి బ్యూటీ. 'ఉప్పెన' సినిమాలో తెరపై ఆమెను చూసి మనసు పారేసుకోని కుర్రాళ్లు లేరు. 'ఇంతకాలం ఈ సుందరి ఏమయిపోయిందబ్బా!' అన్నట్టుగా ఆమె అభిమానుల జాబితాలో పొలోమంటూ చేరిపోయారు. వాలు కళ్లతో ఆమె విసిరే కొంటె చూపుల కొసలకు వాళ్లు చిక్కుబడిపోయారు.ఫస్టు మూవీ టైటిల్ కి తగినట్టుగా 'ఉప్పెన' మాదిరిగానే వచ్చిన కృతి, వరుస విజయాలతో కుదురుకుంది. ముందు వరుసలో ఉన్న యంగ్ హీరోలందరినీ చుట్టబెట్టేసింది. అయితే ఈ మధ్య వరుస ఫ్లాపులు ఆమె అభిమానులను కొంతవరకూ నిరాశపరిచాయి. చేతిలో చైతూ సినిమా 'కస్టడీ' తప్ప మరొకటి కనిపించడం లేదు. తమిళంలో సూర్య జోడీగా ఒక సినిమా చేస్తున్నప్పటికీ, తెలుగులో మునుపటి జోరు అయితే లేదు. దానికి తోడు శ్రీలీల నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. ఇక త్వరలో అనిఖ సురేంద్రన్ (బుట్టబొమ్మ) .. సాక్షి వైద్య (ఏజెంట్) .. ఆషిక రంగనాథ్ (అమిగోస్) వంటి కొత్త బ్యూటీలు రంగంలోకి దిగనున్నారు. దాంతో మరింత పోటీ పెరిగే ఛాన్స్ ఉంది. ఈ రేసులో కృతిని నిలబెట్టేది కొత్త ప్రాజెక్టుల ఎంపిక మాత్రమే అనే విషయం ఆమెకి కూడా తెలుసు.


More Telugu News