ఆస్కార్ బరిలో రెండు భారత డాక్యుమెంటరీలకు నామినేషన్లు
- ఆస్కార్ నామినేషన్ల ఖరారు
- వివిధ విభాగాల్లో నామినేషన్ల ప్రకటన
- డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఆల్ దట్ బ్రీత్స్ కు నామినేషన్
- డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ద ఎలిఫెంట్ విస్పరర్స్ కు నామినేషన్
ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల బరిలో రెండు భారత డాక్యుమెంటరీ చిత్రాలకు నామినేషన్లు ఖరారయ్యాయి.
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఆల్ దట్ బ్రీత్స్ నామినేషన్ దక్కించుకోగా, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ద ఎలిఫెంట్ విస్పరర్స్ నామినేషన్ పొందింది. ఆల్ దట్ బ్రీత్స్ డాక్యుమెంటరీని షౌనక్ సేన్ రూపొందించగా, ద ఎలిఫెంట్ విస్పరర్స్ కు కార్తీకి గొంజాల్వెజ్ దర్శకత్వం వహించింది.
ఢిల్లీలో... గాయపడిన పక్షులను కాపాడే ఇద్దరు అన్నదమ్ములు మహ్మద్ సాద్, నదీమ్ షెహజాద్ ల ఇతివృత్తంతో 'ఆల్ దట్ బ్రీత్స్' డాక్యుమెంటరీ తెరకెక్కింది.
ఇక ఓ అనాథ ఏనుగు పిల్ల కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఓ దక్షిణ భారతదేశ జంట ఇతివృత్తంతో 'ద ఎలిఫెంట్ విస్పరర్స్' షార్ట్ ఫిల్మ్ డాక్యుమెంటరీని రూపొందించారు.