ఏపీలోని పలు పట్టణాలకు జియో 5జీ విస్తరణ
- దేశంలో మరో 50 నగరాలు, పట్టణాలకు జియో 5జీ
- ఏపీలో కడప, చిత్తూరు, ఒంగోలు పట్టణాలకు 5జీ
- వెల్కమ్ ఆఫర్ ఉపయోగించుకోవాలన్న జియో
- 1 జీబీపీఎస్ కంటే అధికవేగంతో అన్ లిమిటెడ్ డేటా
దేశంలో 5జీ విప్లవం ఊపందుకుంది. ఇటీవలే టెలికాం సంస్థలు దేశంలో 5జీ సేవలు ప్రారంభించాయి. తాజాగా, రిలయన్స్ జియో మరో 50 నగరాలు, పట్టణాల్లో 5జీ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. వాటిలో ఏపీకి చెందిన చిత్తూరు, ఒంగోలు, కడప పట్టణాలు కూడా ఉన్నాయి.
దీనిపై రిలయన్స్ జియో అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ విడతలో 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో 5జీ విస్తరించామని, భారీ సంఖ్యలో నగరాలు, పట్టణాల్లో 5జీ అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉందని పేర్కొంది.
కాగా, తాజా విస్తరణతో దేశంలోని 184 నగరాలు, పట్టణాల్లో జియో 5జీ అందుబాటులోకి వచ్చినట్టయింది. కాగా, కొత్తగా 5జీ ప్రవేశపెట్టిన ప్రాంతాల్లోని జియో వినియోగదారులు తమ వెల్కమ్ ఆఫర్ ను ఉపయోగించుకోవాలని జియో సూచించింది. 1 జీబీపీఎస్ ను మించిన వేగంతో అపరిమిత డేటా వాడుకోవచ్చని, అందుకు ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని వెల్లడించింది.