ఆస్కార్ ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు కేటగిరీల్లో ఆర్ఆర్ఆర్ కు నిరాశ

  • ఆస్కార్ అవార్డుల నామినేషన్ల ప్రకటన
  • ఉత్తమ చిత్రం కేటగిరీలో 10 చిత్రాలకు స్థానం
  • ఆర్ఆర్ఆర్ కు లభించని తుది నామినేషన్
  • అవతార్-2 చిత్రానికి నామినేషన్ ఖరారు
  • ఉత్తమ దర్శకుల విభాగంలో స్పీల్ బెర్గ్ కు నామినేషన్
ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల నేపథ్యంలో నేడు తుది నామినేషన్లు ప్రకటించారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్ దక్కించుకున్న ఆర్ఆర్ఆర్... ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు కేటగిరీల్లో నిరాశపరిచింది. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఈ రెండు కేటగిరీల్లో నామినేషన్ దక్కలేదు. ఇక, అవతార్ సీక్వెల్ అవతార్: ద వే ఆఫ్ వాటర్ చిత్రం ఉత్తమ చిత్రం విభాగంలో నామినేషన్ దక్కించుకుంది. 

అటు, విఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్ బెర్గ్ దర్శకత్వంలో తెరకెక్కిన ద ఫేబుల్ మాన్స్ ఉత్తమ చిత్రం రేసులో స్థానం పొందింది. అంతేకాదు, ఈ సినిమాకు గాను స్టీవెన్ స్పీల్ బెర్గ్ ఉత్తమ దర్శకుడిగా నామినేషన్ సొంతం చేసుకున్నారు.

ఉత్తమ చిత్రం నామినేషన్లు పొందిన చిత్రాలు ఇవే...

అవతార్: ద వే ఆఫ్ వాటర్
 టాప్ గన్ మావెరిక్
 ట్రయాంగిల్ ఆఫ్ శాడ్ నెస్
ఉమెన్ టాకింగ్
 ద ఫేబుల్ మాన్స్
 ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్
 ద బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్
 ఎల్విస్
 ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్
 టార్

ఉత్తమ దర్శకులుగా నామినేషన్లు పొందింది వీరే...

ద ఫేబుల్ మాన్స్ (స్టీవెన్ స్పీల్ బెర్గ్)
మార్టిన్ మెక్ డొనా (ద బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్)
టాడ్ ఫీల్డ్ (టార్)
రూబెన్ ఓస్ట్ లండ్ (ట్రయాంగిల్ ఆఫ్ శాడ్ నెస్) 
డానియెల్ క్వాన్, డానియల్ షీనెర్ట్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్)




More Telugu News