చిరూ హమ్ చేసిన 'జంబలకిడి జారు మిఠాయా' సాంగు గురించి బాబీ ఏమన్నాడంటే..!
- వసూళ్ల వర్షాన్ని కురిపిస్తున్న 'వాల్తేరు వీరయ్య'
- ఇంకా ఇంటర్వ్యూలతో బిజీగానే ఉన్న బాబీ
- తనకి నచ్చిన డైలాగ్ .. సాంగ్ గురించిన ప్రస్తావన
- అది అన్నయ్య ఐడియానే అంటూ చెప్పిన బాబీ
చిరంజీవి - బాబీ కాంబినేషన్లో రూపొందిన 'వాల్తేరు వీరయ్య' సినిమా ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 10 రోజుల్లోనే ఈ సినిమా 200 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఈ సినిమాలో మాస్ యాక్షన్ తో పాటు, కామెడీపై చిరంజీవి మార్కు కూడా కనిపిస్తుంది. చిరంజీవి 'జంబలకిడి జారు మిఠాయా' పాటను హమ్ చేయడం కూడా కామెడీపై పరంగా బాగా పేలింది.
ఈ విషయాన్ని గురించి తాజా ఇంటర్వ్యూలో బాబీ మాట్లాడుతూ .. "అన్నయ్య ఈ సినిమాలోని ఒక సీన్ లో ఏదైనా ఒక పాట హమ్ చేస్తూ వెళ్లాలి. ఏ పాట అయితే బాగుంటుందా అని మేము ఆలోచిస్తూ ఉండగానే ఆయన 'జంబలకిడి జారు మిఠాయా .. నేను లుంగీ కట్టా సూడు' అనేశారు. దాంతో అందరం నవ్వేశాము .. అదే పెట్టేశాము" అన్నాడు.
"ఈ పాట పెడదామనే ఐడియా అన్నయ్యదే .. ఆయన చెప్పినట్టుగానే ఆ సీన్ బాగా పేలింది. ఆడియన్స్ ఆ సీన్ లో విపరీతంగా నవ్వుకున్నారు .. బాగా ఎంజాయ్ చేశారు. ఇక ఈ సినిమాలో దేవిశ్రీ రాసిన 'శ్రీదేవి' పాట అంటే చాలా ఇష్టం. అలాగే డైలాగ్స్ విషయానికొస్తే "మాస్ అనే పదానికి బొడ్డుకోసి పేరు పెట్టిందే ఆయనను చూసిరా" నాకు భలేగా నచ్చింది" అని చెప్పకొచ్చాడు.