ఈ నిర్ణయం తీసుకోకపోతే సమస్య పెద్దది అయ్యేది: ఉద్యోగుల తొలగింపుపై సుందర్ పిచాయ్

  • వృద్ధి నెమ్మదించిన నేపథ్యంలో కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్న సుందర్ 
  • కఠిన నిర్ణయం తీసుకోకపోతే సంస్థ పరిస్థితి దారుణంగా మారి ఉండేదని వ్యాఖ్య 
  • కీలక ఉద్యోగులకు ఈ ఏడాది బోనస్ లు తగ్గుతాయని వెల్లడి 
ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. దీనిపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మాట్లాడుతూ, కంపెనీ వృద్ధి నెమ్మదించిన నేపథ్యంలో కొంత కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని చెప్పారు. ముందస్తుగా అత్యంత కచ్చితమైన ఈ నిర్ణయాన్ని తీసుకోకపోతే సమస్య మరింత పెద్దదయ్యేదని... తద్వారా సంస్థ పరిస్థితి దారుణంగా మారి ఉండేదని అన్నారు. 

ఉద్యోగులతో నిర్వహించిన అంతర్గత సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సంస్థలో కీలక పదవుల్లో ఉన్న అందరికీ ఈ ఏడాది బోనస్ లు తగ్గుతాయని చెప్పారు. సుదీర్ఘ కాలం పాటు కంపెనీలో పని చేసి, ఇప్పుడు ఉద్యోగాన్ని కోల్పోయిన వారికి పరిహార ప్యాకేజీని ఏర్పాటు చేసినట్టు కంపెనీకి చెందిన ఒక ఉన్నతోద్యోగి తెలిపారు.


More Telugu News