ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
- తీవ్ర ఒడిదుడుకులకు గురైన మార్కెట్లు
- 37 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 0.25 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే భారీ లాభాల్లోకి వెళ్లిన మార్కెట్లు ఆ తర్వాత ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో లాభాలు ఆవిరయ్యాయి. ఈ క్రమంలో, ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 37 పాయింట్లు లాభపడి 60,978కి పెరిగింది. నిఫ్టీ 0.25 పాయింట్లు నష్టపోయి 18,118 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (3.34%), మారుతి (3.27%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.47%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.35%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (0.92%).
టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్ (-2.50%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.76%), టాటా స్టీల్ (-1.35%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-1.31%), ఎల్ అండ్ టీ (-1.18%).