‘పఠాన్’ రికార్డు.. 100 దేశాల్లో రిలీజ్!
- ఓవర్ సీస్ లో 2,500కు పైగా థియేటర్లలో స్క్రీనింగ్
- ఇండియన్ సినిమా హిస్టరీలోనే తొలిసారి
- జనవరి 25న పఠాన్ రిలీజ్
కొన్నేళ్ల గ్యాప్ తర్వాత షారుఖ్ ఖాన్ నటిస్తున్న సినిమా ‘పఠాన్’. కానీ రిలీజ్ కు ముందే వివాదాల్లో చిక్కుకుంది. అలాగని హైప్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో రిలీజ్ కు ముందే రికార్డులూ సృష్టిస్తోంది. పాన్ ఇండియా స్థాయిని దాటి.. పాన్ వరల్డ్ మూవీగా పఠాన్ మారింది. ఒకటీ రెండు కాదు ఏకంగా 100కు పైగా దేశాల్లో.. 2,500కు పైగా స్కీన్లలో రిలీజ్ అవుతోంది.
జనవరి 25న పఠాన్ రిలీజ్ కానుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షారుఖ్ తోపాటు దీపికా పదుకొణే, జాన్ అబ్రహం వంటి స్టార్లు నటిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా ఓవర్ సీస్ లో కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 100 కు పైగా దేశాల్లో మూవీ రిలీజ్ అవుతోందని, ఇది ఇండియా సినిమా చరిత్రలోనే తొలిసారి అని ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ వైస్ ప్రెసిడెంట్ నెల్సన్ డిసౌజా చెప్పారు.
‘‘ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాకి ఇది అత్యంత భారీ రిలీజ్. షారుఖ్ ఖాన్ అంతర్జాతీయంగా అతిపెద్ద సూపర్‌స్టార్‌గా నిలిచారు. సినిమాపై వచ్చిన హైప్ వల్ల ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి డిమాండ్ ఏర్పడింది’’ అని తెలిపారు. ‘‘యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో ఇది నాలుగో సినిమా. ఓవర్ సీస్ లో పఠాన్ భారీ వసూళ్లు సాధిస్తుందని భావిస్తున్నాం. ఈ సంవత్సరంలో థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్‌కు ఈ మూవీ తిరిగి ఉత్సాహాన్ని తీసుకొస్తుంది’’ అని ఆయన చెప్పుకొచ్చారు.
మూవీ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ కూడా పఠాన్ ప్రీ రిలీజ్ రికార్డులపై ట్వీట్ చేశారు. ‘‘100కు పైగా దేశాలు.. ఓవర్ సీస్ లో 2,500కు పైగా స్క్రీన్లలో పఠాన్ రిలీజ్’’ అని పేర్కొన్నారు.