చివరి వన్డేలో టాస్ గెలిచిన న్యూజిలాండ్.... భారత్ దూకుడు
- ఇప్పటికే సిరీస్ నెగ్గిన భారత్
- నేడు ఇండోర్ లో చివరి వన్డే
- టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న కివీస్
- 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 82 రన్స్ చేసిన భారత్
మూడు వన్డేల సిరీస్ లో ఇప్పటికే ఫలితం తేలిపోగా, నేడు నామమాత్రపు చివరి వన్డేలో టీమిండియా, న్యూజిలాండ్ తలపడుతున్నాయి. ఇండోర్ లోని హోల్కర్ స్టేడియం వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
ఈ నేపథ్యంలో, తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు శుభారంభం లభించింది. ఓపెనర్లు శుభ్ మాన్ గిల్, కెప్టెన్ రోహిత్ శర్మ రాణించడంతో 10 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 82 పరుగులు చేసింది. గిల్ 41, రోహిత్ 39 పరుగులతో క్రీజులో ఉన్నారు.
కాగా, టీమిండియా ఇప్పటికే 2-0తో సిరీస్ గెలిచిన సంగతి తెలిసిందే. దాంతో, ఈ మ్యాచ్ లో సిరాజ్, షమీలకు విశ్రాంతినిచ్చారు. వారి స్థానంలో ఉమ్రాన్ మాలిక్, చహల్ జట్టులోకి వచ్చారు. అటు, న్యూజిలాండ్ జట్టులోనూ ఒక మార్పు జరిగింది. హెన్రీ షిప్లే స్థానంలో జాకబ్ డఫీ జట్టులోకి వచ్చాడు.