వారాహి రెడీ.. కొండగట్టులో పూర్తయిన పూజలు
- ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పవన్ కల్యాణ్
- ప్రచార రథానికి పూజల తర్వాత వేదపండితుల ఆశీర్వాదం
- వారాహిలోకి ఎక్కి కార్యకర్తలు, అభిమానులకు జనసేనాని అభివాదం
జనసేన పార్టీ ప్రచార రథం వారాహి ఎన్నికల ప్రచారానికి సిద్ధమైంది. కొండగట్టులో ప్రత్యేక పూజల తర్వాత జనసేనాని పవన్ కల్యాణ్ రథంలోకి ఎక్కారు. వారాహి పై నుంచి అభిమానులు, జనసేన కార్యకర్తలకు పవన్ అభివాదం చేశారు. వారాహికి పూజల కోసం పవన్ కల్యాణ్ మంగళవారం ఉదయం కొండగట్టు చేరుకున్నారు.
కొండగట్టు ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు చేశారు. జనసేన పార్టీ అభివృద్ధికి, లోక కల్యాణానికి, కొండగట్టు అంజనేయ స్వామి ఆశీర్వాదం కోరుతూ పార్టీ ప్రచార రథానికి పండితులు పూజలు చేశారు. అనంతరం పవన్ కల్యాణ్ ను వేదమంత్రోచ్చారణలతో ఆశీర్వదించారు. తర్వాత పవన్ కల్యాణ్ తో పండితులు ఫొటోలు దిగారు.
కొండగట్టుకు వచ్చిన పవన్ కల్యాణ్ ను చూడడానికి అభిమానులు పోటెత్తారు. జనసేన కార్యకర్తలు, అభిమానుల సందడితో ఆలయ పరిసరాలు హోరెత్తాయి. వారాహికి పూజలు పూర్తయ్యాక వాహనంలోకి ఎక్కి అభిమానులు, కార్యకర్తలకు పవన్ అభివాదం చేశారు. కాగా, ఉదయం 11 గంటలకే పవన్ కల్యాణ్ కొండగట్టు చేరుకోవాల్సి ఉండగా.. ట్రాఫిక్ జామ్ కారణంగా కొద్దిగా ఆలస్యంగా ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జనసేనానికి అడుగడుగునా ఘన స్వాగతం లభించింది.