భారీ కాన్వాయ్ తో కొండగట్టుకు బయల్దేరిన పవన్ కల్యాణ్.. ఫొటోలు ఇవిగో
- కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోనున్న పవన్
- తన ప్రచార రథం వారాహికి పూజలు నిర్వహించనున్న జనసేనాని
- కొండగట్టుకు భారీగా చేరుకున్న జనసైనికులు, అభిమానులు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ కాన్వాయ్ మధ్య జగిత్యాల జిల్లా కొండగట్టుకు బయల్దేరారు. కాసేపట్లో ఆయన అక్కడకు చేరుకుని ఆంజనేయస్వామి వారిని దర్శించుకోనున్నారు. అనంతరం వేద పండితుల మధ్య తన ప్రచార రథం వారాహికి పూజలు నిర్వహించి, ప్రచార రథాన్ని ప్రారంభించనున్నారు.
కొండగట్టు ఆంజనేయస్వామి అంటే పవన్ కు అమితమైన భక్తిభావం ఉందనే విషయం తెలిసిందే. ఏదైనా కార్యక్రమానికి ముందు ఆయన కొండగట్టు ఆలయంలో పూజలు నిర్వహిస్తుంటారు. మరోవైపు పవన్ వస్తున్న నేపథ్యంలో కొండగట్టులో కోలాహలం నెలకొంది. జనసైనికులు, పవన్ అభిమానులు ఇప్పటికే పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. పవన్ కు ఆహ్వానం పలుకుతూ పెద్ద ఎత్తున బ్యానర్లు వెలిశాయి. మార్గమధ్యంలో ఆయనను అభిమానులు గజమాలతో సత్కరించారు.