పంచదారను పూర్తిగా వదిలిపెట్టాలా?
- ప్రాసెస్డ్ చక్కెరతో నష్టమే ఎక్కువ
- పరిమితంగా బ్రౌన్ షుగర్ తీసుకోవచ్చు
- చక్కెర మానేస్తే రోజువారీగా పండ్లు తప్పకుండా తినాలి
తీపి నచ్చనిది ఎవరికి? నిత్యం టీ, కాఫీ గొంతు దిగాలంటే అందులో చక్కెర కలవాల్సిందే. పుట్టిన రోజు, పర్వదినాల్లో పాయసం కోసం, మిఠాయిల కోసం చక్కెర ఉండాల్సిందే. కానీ, నేడు మారిన జీవనశైలి వల్ల ఈ చక్కెరలతో మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతోంది. దీంతో మధుమేహం కొలెస్ట్రాల్, రక్తపోటు తదితర సమస్యల బారిన పడుతున్నాం. దీనిపై ఇటీవలి కాలంలో అవగాహన పెరుగుతుండడంతో కొంత మంది పంచదారకు పూర్తిగా గుడ్ బై చెబుతున్నారు.
చక్కెర రకాలు
చక్కెరలో రెండు రకాల కాంపౌండ్లు ఉంటాయి. ఇవి మన శరీర జీవక్రియలకు అవసరం. అవి గ్లూకోజ్, ఫ్రక్టోజ్. పండ్లు, కూరగాయల్లో ఉండేది సహజమైన చక్కెర. కనుక పండ్లు, కూరగాయల రూపంలో శరీరానికి అందే ఫ్రక్టోజ్ తో నష్టం ఉండదు. విడిగా తీసుకునే చక్కెరతోనే నష్టం. చక్కెరలో కేలరీలు ఎక్కువని చెబుతుంటారు. కానీ, అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రకారం చక్కెరలకు, బరువు పెరగడానికి మధ్య సంబంధం లేదు.
చక్కెరకు ప్రత్యామ్నాయాలు
షురగ్ ఫ్రీ పేరుతో మార్కెట్లో ఎన్నో రకాల ఉత్పత్తులు విక్రయమవుతున్నాయి. షుగర్ ఫ్రీ అంటే ఆయా ఉత్పత్తులలో ఆర్టిఫిషియల్ స్వీట్ నర్ అయిన శాక్రిన్ ఉంటుంది. నిజానికి చక్కెర కంటే ఈ శాక్రిన్ తోనే ప్రమాదం ఎక్కువ. బరువు పెరగడం, అధిక రక్తపోటు, మధుమేహం రిస్క్ దీంతో ఉంటుంది.
చక్కెరను పూర్తిగా మానేస్తే..?
చక్కెరను పూర్తిగా మానేయవచ్చా? అంటే దీనికి నిపుణుల సూచన భిన్నంగా ఉంది. శరీరంలో గ్లూకోజ్ పరిమాణం తగ్గితే అది రక్తపోటు పడిపోయేందుకు కారణమవుతుంది. తల తిరగడం తదితర సమస్యలు వస్తాయి. కనుక శరీరానికి గ్లూకోజ్ అందేలా చూసుకోవాలి. కనుక చక్కెర మానేసేవారు తప్పకుండా రోజులో రెండు పండ్లు అయినా తినాలి. పళ్లెంలో కూరగాయలకు ఎక్కువ చోటు ఇవ్వాలి. మార్కెట్లో లభించే ప్రాసెస్డ్ షుగర్ మంచిది కాదు. దీనికి బదులు ప్రాసెస్డ్ చేయని బ్రౌన్ షుగర్ వాడుకోవచ్చు. ఇది కూడా పరిమితంగానే తీసుకోవాలి. రోజువారీ జీవనంలో సహజ చక్కెరలకు ప్రాధాన్యం ఇచ్చి, ఫ్యాక్టరీల్లో తయారయ్యే ప్రాసెస్డ్ చక్కెర వినియోగాన్ని తగ్గించుకోవడం వల్ల ఆరోగ్యానికి నష్టం జరగకుండా చూసుకోవచ్చు.