తుగ్లక్ ఆలోచనలు మానుకుని పాదయాత్రకు అనుమతిని ఇవ్వండి: బొండా ఉమ

  • లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసిన బొండా ఉమ
  • పాదయాత్ర రూట్ మ్యాప్ ను పోలీసులకు ఇచ్చామని వెల్లడి
  • డీజీపీ తల, తోక లేని ప్రశ్నలు అడుగుతున్నారని విమర్శ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ నేతలు బొండా ఉమ, కేశినేని చిన్ని భారీ కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా బొండా ఉమ మీడియాతో మాట్లాడుతూ, నారా లోకేశ్ యువ గళం పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ ను పోలీసులకు ఇచ్చామని చెప్పారు. రాష్ట్ర డీజీపీ తల, తోక లేని ప్రశ్నలను అడుగుతున్నారని విమర్శించారు. 

పాదయాత్ర చేయడానికి రాజ్యాంగం ప్రకారం అనుమతులు అవసరమే లేదని చెప్పారు. అనుమతులు అవసరం లేదనే విషయం 1861 చట్టంలో ఉందని అన్నారు. పోలీసులకు కేవలం సమాచారం ఇస్తే సరిపోతుందని చెప్పారు. ఇదే విషయాన్ని వైసీపీ సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి, ధర్మాన కూడా గతంలో చెప్పారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ తుగ్లక్ ఆలోచనలను మానుకుని పాదయాత్రకు అనుమతిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాదయాత్రను ఆపాలని చూస్తే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాజకీయ కక్ష సాధింపుల కోసమే జీవో నెంబర్ 1ను తీసుకొచ్చారని విమర్శించారు.


More Telugu News