నేడే కేఎల్ రాహుల్, అతియా వివాహం.. దక్షిణాది సంప్రదాయ వంటకాల వడ్డన
- అరిటాకుల్లోనే అతిథులకు భోజనాలు
- సంప్రదాయానికి పెద్ద పీట
- పెళ్లి తర్వాత 3,000 మందికి గ్రాండ్ రిసెప్షన్
ప్రముఖ క్రికెటర్, లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్, బాలీవుడు నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి ఒక్కటి కాబోతున్నారు. వీరి వివాహం పూణెకు సమీపంలోని ఖండాలాలో ఉన్న సునీల్ శెట్టి ఫామ్ హౌస్ లో నేడు జరగనుంది. 100 మంది అతిథులకు వివాహ ఆహ్వానం పంపినట్టు తెలుస్తోంది. వివాహం తర్వాత ముంబైలో ప్రముఖుల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. కత్రినాకైఫ్, విక్కీ కౌశల్ వివాహం మాదిరే అతిథులెవరూ ఫోన్ వినియోగించడానికి అనుమతించరు.
బాలీవుడ్ పరిశ్రమకు చెందిన నటులు, వ్యాపారవేత్తలు, క్రికెటర్లు ఇలా సుమారు 3,000 అతిథులను వెడ్డింగ్ రిసెప్షన్ కు ఆహ్వానించనున్నారు. టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణ ష్రాఫ్, బాలీవుడ్ ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ట పెళ్లి వేడుకను షూట్ చేయనున్నారు. ముఖ్యంగా వీరి వివాహానికి వచ్చే అతిథులకు దక్షిణాది వంటకాలను వడ్డించనున్నారు. అది కూడా అరిటాకులపైనే భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు వీరి వివాహం జరగనుంది. బెంగళూరులోనూ వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది.