సెన్సార్ సర్టిఫికెట్ వచ్చాక కూడా వివాదాలు బాధిస్తాయి: అక్షయ్ కుమార్
- అక్షయ్ కుమార్ ‘సెల్ఫీ’ ట్రైలర్ విడుదల
- మోదీ వ్యాఖ్యలతో కొంతైనా మార్పు వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పిన అక్షయ్ కుమార్
- మోదీ ప్రభావశీల వ్యక్తి అని ప్రశంసలు
షారుఖ్ ఖాన్ సినిమా ‘పఠాన్’ వివాదం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల మాట్లాడుతూ.. సినిమాల విషయంలో అనవసర వ్యాఖ్యలు చేయొద్దని నేతలు, కార్యకర్తలకు సూచించారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ స్పందించారు. దేశంలోనే మోదీ అతిపెద్ద ప్రభావశీల వ్యక్తి అని ప్రశంసించారు. ఆయన వ్యాఖ్యలు మార్పు తీసుకురాగలిగితే సినీ పరిశ్రమకు కొంతైనా మేలు జరుగుతుందని అన్నారు.
సినిమాలు తీసేందుకు తాము చాలా శ్రమిస్తామని, ఆ తర్వాత వాటికి సెన్సార్ సర్టిఫికెట్ పొందుతామన్నారు. ఇవన్నీ అయ్యాక కూడా ఎవరో అనవసర వ్యాఖ్యలు చేయడంతో వివాదం తెరపైకి వస్తుందని అక్షయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన నటించిన ‘సెల్ఫీ’ ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని ముంబైలో నిర్వహించారు. ఈ సందర్భంగా అక్షయ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.