అమెరికాలో చైనా నూతన సంవత్సర వేడుకలను రక్త సిక్తం చేసిన అనుమానితుడి ఆత్మహత్య
- కాలిఫోర్నియాలోని మాంటెరీ పార్క్ నగరంలో ఘటన
- న్యూ ఇయర్ వేడుకల్లో కాల్పులు
- దొరికిన నిందితుడిని చుట్టుముట్టిన పోలీసులు
- తప్పించుకునే మార్గం లేక ఆత్మహత్య
కాలిఫోర్నియాలోని మాంటెరీ పార్క్ నగరంలో జరిగిన చైనా నూతన సంవత్సర వేడుకల్లో కాల్పులు జరిపి 10 మందిని పొట్టనపెట్టుకున్న దుండగుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు చుట్టుముట్టడంతో మరో మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నాడు. అనుమానితుడి వ్యాన్‌ను పోలీసులు చుట్టుముట్టారని, ఆ తర్వాత వాహనం నుంచి తుపాకి పేలిన శబ్దం వినిపించిందని లాస్ ఏంజెలెస్ పోలీసులు తెలిపారు. ఆ తర్వాత వెళ్లి చూస్తే నిందితుడు రక్తపు మడుగులో పడి ఉన్నట్టు చెప్పారు.
ఆసియా దేశస్థులు ఎక్కువగా నివసించే మాంటెరీ పార్క్‌లో నిన్న చైనా నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. లాస్ ఏంజెలెస్‌కు 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ నగరం. వేడుకలు సంబరంగా జరుగుతుండగా ఓ దుండగుడు తుపాకితో ప్రవేశించి విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన తర్వాత పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు చుట్టుముట్టారు. అయితే, వారికి పట్టుబడకుండా ఉండేందుకు తనను తాను కాల్చుకున్నాడు.