నాలా సింహంలా పుట్టాలి: 'వీరసింహారెడ్డి' సెలబ్రేషన్స్ లో బాలయ్య
- 'వీరసింహారెడ్డి' విజయోత్సవ వేడుకలో బాలయ్య
- తన మేనరిజంలో నుంచే కథ పుట్టిందంటూ వ్యాఖ్య
- విలనిజం ఈ సినిమాకి హైలైట్ అని వెల్లడి
- తమన్ పాటలు ప్రాణం పోశాయని కితాబు
'వీరసింహారెడ్డి' సినిమా బ్లాక్ బాస్టర్ సెలబ్రేషన్స్ హైదారాబాదులో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకి ఈ సినిమా నటీనటులు .. సాంకేతిక నిపుణులతో పాటు, హరీశ్ శంకర్ .. హను రాఘవపూడి .. అనిల్ రావిపూడి .. శివ నిర్వాణ .. బీవీఎస్ రవి .. విష్వక్సేన్ .. సిద్ధూ జొన్నలగడ్డ తదితరులు హాజరయ్యారు. ఈ వేదికపై బ్లాక్ బస్టర్ షీల్డ్స్ ను బాలకృష్ణ చేతుల మీదుగా అందజేయడం జరిగింది.
ఈ స్టేజ్ పై బాలకృష్ణ మాట్లాడుతూ .. " ఏ విషయాన్నైనా నిజాయితీగా .. ధైర్యంగా చెప్పడమనేది ఒక గర్జనలా ఉండాలి. అలా ఉండాలంటే నాలా సింహంలా పుట్టాలి. ఈ సినిమాలో ఎదురులేని .. బెదురులేని వీరసింహారెడ్డిని నేనే. చాలా ఏళ్ల తరువాత నేను చేసిన ఫ్యాక్షన్ సినిమా ఇది. నా మేనరిజంలో నుంచే ఒక్కోసారి కథలు పుడుతూ ఉంటాయి. ఆ విషయంలో బోయపాటి సమర్థుడు.
అలాగే ఈ సారి నా మేనరిజంలో నుంచి కథను తీశాడు గోపీచంద్ మలినేని. అలాంటి ఈ కథను వివిధ ప్రాంతాలకి చెందిన వివిధ భాషల వారు కూడా ఆదరించడం విశేషం. ఈ సినిమాకి దునియా విజయ్ .. వరలక్ష్మి శరత్ కుమార్ విలనిజం హైలైట్ గా నిలిచాయి. తమన్ పాటలు ప్రాణం పోశాయి. ఆదరించిన అందరికీ ధన్యవాదాలు" అంటూ చెప్పుకొచ్చారు. .
ఈ స్టేజ్ పై బాలకృష్ణ మాట్లాడుతూ .. " ఏ విషయాన్నైనా నిజాయితీగా .. ధైర్యంగా చెప్పడమనేది ఒక గర్జనలా ఉండాలి. అలా ఉండాలంటే నాలా సింహంలా పుట్టాలి. ఈ సినిమాలో ఎదురులేని .. బెదురులేని వీరసింహారెడ్డిని నేనే. చాలా ఏళ్ల తరువాత నేను చేసిన ఫ్యాక్షన్ సినిమా ఇది. నా మేనరిజంలో నుంచే ఒక్కోసారి కథలు పుడుతూ ఉంటాయి. ఆ విషయంలో బోయపాటి సమర్థుడు.
అలాగే ఈ సారి నా మేనరిజంలో నుంచి కథను తీశాడు గోపీచంద్ మలినేని. అలాంటి ఈ కథను వివిధ ప్రాంతాలకి చెందిన వివిధ భాషల వారు కూడా ఆదరించడం విశేషం. ఈ సినిమాకి దునియా విజయ్ .. వరలక్ష్మి శరత్ కుమార్ విలనిజం హైలైట్ గా నిలిచాయి. తమన్ పాటలు ప్రాణం పోశాయి. ఆదరించిన అందరికీ ధన్యవాదాలు" అంటూ చెప్పుకొచ్చారు.