ఫ్యాన్స్ కోసమే బాలయ్య రిస్కీ ఫైట్స్ చేశారు: రామ్ లక్ష్మణ్
- ఈ నెల 12న విడుదలైన 'వీరసింహారెడ్డి'
- హైదరాబాదులో నిర్వహించిన విజయోత్సవ వేడుక
- గోపీచంద్ మలినేని నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాడన్న రామ్ లక్ష్మణ్
- బాలయ్య కష్టమే సక్సెస్ కి కారణమని వెల్లడి
బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన 'వీరసింహారెడ్డి' సినిమా, ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. శ్రుతి హాసన్ కథానాయికగా అలరించిన ఈ సినిమా, అన్ని ప్రాంతాలలోను భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా విజయోత్సవ వేడుకను హైదరాబాదులో నిర్వహించారు.
"ఈ సినిమాకి రామ్ - లక్ష్మణ్ ఫైట్స్ ను కంపోజ్ చేశారు. వారు కంపోజ్ చేసిన మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ కి మంచి మార్కులు పడ్డాయి. విజయోత్సవ వేడుకలో వాళ్లు మాట్లాడుతూ .. "తింటే గారెలే తినాలి .. వింటే బాలయ్య బాబు డైలాగులే వినాలి అనే విషయాన్ని 'వీరసింహారెడ్డి' నిరూపించింది. అలాంటి ఒక సినిమాలో భాగమైనందుకు మాకు చాలా ఆనందంగా ఉంది' అన్నారు.
"బాలయ్య బాబు ఏ ఫైట్ కూడా చేయనని అనలేదు. రోప్ తో చేసే ఫైట్స్ కి కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. అభిమానుల కోసం ఆయన రిస్క్ తీసుకున్నారు. ఆయన కష్టమే ఈ సినిమా అనడంలో సందేహం లేదు. త్రివిక్రమ్ ఈ సినిమా చూసి గోపీచంద్ మలినేని గురించి చాలాసేపు మాట్లాడారంటే అర్థం చేసుకోవచ్చు. ఒకే పండగకి రెండు పెద్ద సినిమాలను రిలీజ్ చేసిన రికార్డు మైత్రీవారికే దక్కింది' అంటూ చెప్పుకొచ్చారు.