ఆస్ట్రేలియన్ ఓపెన్ లో మరో సంచలనం... వరల్డ్ నెం.1 స్వైటెక్ ఓటమి
- నాలుగో రౌండ్ మ్యాచ్ లో స్వైటెక్, రైబాకినా ఢీ
- వరుస సెట్లలో ఓడిపోయిన స్వైటెక్
- క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన రైబాకినా
- పురుషుల సింగిల్స్ లో క్వార్టర్స్ చేరిన సిట్సిపాస్
మెల్బోర్న్ లో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీలో నేడు సంచలనం చోటుచేసుకుంది. పురుషుల సింగిల్స్ లో ఇప్పటికే డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ ఓటమి చవిచూడగా, మహిళల సింగిల్స్ విభాగంలో వరల్డ్ నెంబర్ వన్ క్రీడాకారిణి ఇగా స్వైటెక్ కూడా అదే బాటలో నడిచింది. ఇవాళ జరిగిన నాలుగో రౌండ్ లో స్వైటెక్ 4-6, 4-6 తేడాతో ఎలెనా రైబాకినా చేతిలో పరాజయం పాలైంది. ఈ పోరు కేవలం గంటన్నరలో ముగిసింది.
తొలి సెట్ కోల్పోయిన స్వైటెక్... రెండో సెట్లో అయినా పుంజుకుంటుంది అనుకుంటే, పేలవ ఆటతీరు కనబర్చి మూల్యం చెల్లించుకుంది. రైబాకినా గతేడాది వింబుల్డన్ గెలిచి సత్తా చాటింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ లోనూ అదే జోరు చూపిస్తోంది. రైబాకినా.... జెలెనా ఓస్టాపెంకో, కోకో గాఫ్ ల మధ్య జరిగే మ్యాచ్ విజేతతో క్వార్టర్ ఫైనల్స్ లో తలపడనుంది.
అటు, పురుషుల సింగిల్స్ లో గ్రీస్ ఆటగాడు స్టెఫానో సిట్సిపాస్ క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించాడు. మూడో సీడ్ సిట్సిపాల్ ఇవాళ ఐదు సెట్ల పాటు జరిగిన మ్యాచ్ లో 6-4, 6-4, 3-6, 4-6, 6-3తో ఇటలీకి చెందిన జానిక్ సిన్నర్ పై నెగ్గాడు. తొలి రెండు సెట్లు అలవోకగా నెగ్గిన సిట్సిపాస్ కు ఆ తర్వాత రెండు సెట్లలో సిన్నర్ నుంచి అద్భుత ప్రతిఘటన ఎదురైంది. సిన్నర్ వరుసగా రెండు సెట్లు నెగ్గి మ్యాచ్ ను ఐదో సెట్ లోకి తీసుకెళ్లాడు.
అయితే, సిట్సిపాస్ తన ట్రేడ్ మార్క్ పవర్ గేమ్ తో సిన్నర్ నుంచి మ్యాచ్ ను లాగేసుకున్నాడు. చివరి సెట్ లో భారీ సర్వీసులు, బలమైన గ్రౌండ్ షాట్లతో సిన్నర్ ను నిస్సహాయుడిగా మార్చేశాడు.