భారత్ లో చైనా నూతన సంవత్సర వేడుకలు... ఎక్కడంటే...!
- జనవరి 22న చైనా నూతన సంవత్సరాది
- కోల్ కతాలోని తంగ్రా గ్రామంలో మిన్నంటిన సంబరాలు
- ఎన్నో తరాల కిందట కోల్ కతా వలస వచ్చిన చైనీయులు
- ఇక్కడే స్థిరపడిపోయిన వైనం
ల్యూనార్ కాలెండర్ ప్రకారం చైనా కొత్త సంవత్సరం జనవరి 22న వస్తుంది. తాజాగా వారికి కుందేలు నామ సంవత్సరం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చైనీయులు తమ సంవత్సరాదిని వైభవంగా జరుపుకున్నారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా మహానగరంలో ఓల్డ్ చైనా మార్కెట్ ప్రాంతంలోనూ చైనా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ ప్రాంతంలో కొన్ని తరాలుగా చైనా సంతతి కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. చైనా సంవత్సరాది సందర్భంగా వారు కోల్ కతా ఓల్డ్ మార్కెట్ ప్రాంతంలో ల్యూనార్ ఫెస్టివల్ నిర్వహించారు. ఎర్రని కాంతులు విరజిమ్మే లాంతర్లు, ఎరుపు-పసుపు రంగు విద్యుద్దీపాలు, వైవిధ్యభరితమైన వేషధారణలు, బాణసంచా కోలాహలం, డ్రాగన్, పులి నృత్యాలతో సందడి చేశారు. ఇక్కడి కాళీమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు అని రాసివున్న ఎరుపురంగు వస్త్రాలను వీధుల్లో ప్రదర్శించారు.
ఎన్నో తరాల కిందట ఉపాధి కోసం చైనీయులు కోల్ కతా వచ్చారు. ఇలా వలస వచ్చిన చైనీయులతో కోల్ కతాలో తంగ్రా గ్రామం ఏర్పడింది. కరోనా సంక్షోభం కారణంగా కొన్నేళ్లుగా ఇక్కడ ల్యూనార్ ఫెస్టివల్ నిర్వహించలేదు. ఈసారి కరోనా సద్దుమణగడంతో తంగ్రా గ్రామంలో అట్టహాసంగా నూతన సంవత్సర వేడుకలు జరిపారు. ఈ వేడుకల్లో చైనీయులతో పాటు భారతీయులు కూడా పాల్గొన్నారు.