న్యాయమూర్తుల నైపుణ్యం ఇందులోనే ఉంది: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్
- సరైన తీర్పులను ఇవ్వడంలోనే న్యాయమూర్తుల నైపుణ్యం ప్రతిఫలిస్తుంది
- రాజ్యాంగం ఆత్మను చెక్కు చెదరకుండా అర్థం చేసుకోవాలి
- మన రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణం ఉత్తర నక్షత్రం వంటిది
కాలానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని అన్వయించడంలోనే న్యాయమూర్తుల నైపుణ్యం దాగుంటుందని సుప్రీకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. సరైన తీర్పులను ఇవ్వడంలోనే న్యాయమూర్తుల నైపుణ్యం ప్రతిఫలిస్తుందని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రాజ్యాంగంలోని పాఠ్యాంశాలను, దాని ఆత్మను చెక్కు చెదరకుండా అర్థం చేసుకోవాలని సూచించారు. ముందుకు సాగే మార్గం క్లిష్టంగా ఉన్నప్పుడు వ్యాఖ్యాతలు, దాన్ని అమలు చేసే వారికి రాజ్యాంగం నిర్దిష్టమైన దిశను అందిస్తుందని చెప్పారు.
న్యాయ సమీక్ష, లౌకికవాదం, చట్టం, పాలన, అధికారాల విభజన, సమాఖ్యవాదం, స్వేచ్ఛ, వక్తిగత గౌరవం, దేశ ఐక్యత, సమగ్రత ఇవన్నీ అత్యంత ముఖ్యమైనవని తెలిపారు. మన రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణం ఉత్తర నక్షత్రం వంటిదని చెప్పారు. ముంబైలో జరిగిన నాని పాల్కీవాలా మెమోరియల్ లెక్చర్ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.