ఈ నెల 26 నుంచి 'హాత్ సే హాత్ జోడో' యాత్ర: రేవంత్ రెడ్డి
- జోడో యాత్రలో భాగంగా ఫిబ్రవరి 6 నుంచి పాదయాత్ర
- తాను భద్రాచలం నుంచి పాదయాత్ర చేస్తానన్న రేవంత్
- భద్రాచలంలో భారీ బహిరంగ సభ
- ప్రియాంక గాంధీ హాజరవుతారని చెప్పిన రేవంత్
తెలంగాణలో కాంగ్రెస్ ను మళ్లీ బలోపేతం చేసి, పూర్వవైభవం సాధించే దిశగా పార్టీ నాయకత్వం కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా ఈ నెల 26 నుంచి 'హాత్ సే హాత్ జోడో' యాత్ర నిర్వహిస్తున్నట్టు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. 'హాత్ సే హాత్ జోడో' యాత్రలో భాగంగానే, ఫిబ్రవరి 6 నుంచి రెండు నెలల పాటు పాదయాత్ర ఉంటుందని తెలిపారు.
భద్రాచలం నుంచి తాను పాదయాత్ర ప్రారంభిస్తానని రేవంత్ వివరించారు. భద్రాచలంలో భారీ బహిరంగ సభకు ప్రియాంక గాంధీ హాజరవుతారని పేర్కొన్నారు.
ఇక, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రేతో సమావేశానికి మూడు పర్యాయాలు హాజరుకాని నేతల నుంచి వివరణ తీసుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కీలక సమయాల్లో సమావేశాలకు రాని నేతలను పార్టీ నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.