19 ఏళ్లకే ఎందుకు పెళ్లి చేసుకోవలసి వచ్చిందంటే: నటి వరలక్ష్మి

  • 70వ దశకంలో బాలనటిగా వరలక్ష్మి ఎంట్రీ
  • సీనియర్ స్టార్ హీరోల చెల్లెలిగా పాప్యులర్ 
  • తన పెళ్లి గురించిన ప్రస్తావన 
  • రీ ఎంట్రీ ఇస్తానని తేల్చిన వరలక్ష్మి 
70వ దశకంలో వరలక్ష్మి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బాలనటిగా తన కెరియర్ ను మొదలెట్టిన వరలక్ష్మి, ఆ తరువాత ఎన్టీఆర్ .. ఏఎన్నార్ లకు కూతురు పాత్రలలో నటించారు. కృష్ణ .. శోభన్ బాబు .. చిరంజీవి .. బాలకృష్ణ .. నాగార్జునలకు చెల్లెలుగా కనిపించారు. అప్పట్లో సిస్టర్ సెంటిమెంట్ కథలు చేయాలనుకున్నవారు ముందుగా పరిశీలించింది వరలక్ష్మి పేరే.

తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వరలక్ష్మి మాట్లాడుతూ .. "నేను 19 ఏళ్లకే పెళ్లి చేసుకోవలసి వచ్చింది. నా చిన్నతనంలోనే నాన్నగారు చనిపోయారు. నాతో పాటు ఆయనే షూటింగులకు వచ్చేవారు. ఆయన చనిపోవడంతో అయోమయంలో పడిపోయాను. అమ్మ ఇంటి పనులు చూసుకోవాలి .. చెల్లెళ్లు చదువుకుంటున్నారు" అన్నారు. 

"అలాంటి సమయంలోనే పెళ్లి ప్రపోజల్ వచ్చింది. కుటుంబ పరిస్థితులను బట్టి ఒక తోడు ఉండటమే మంచిదని అనుకున్నాను. అందువల్లనే పెళ్లికి ఓకే చెప్పాను. అంత చిన్నవయసులోనే పెళ్లి చేసుకోవడం వలన, అంతా షాక్ అయ్యారు. నాతో పాటు చేసిన తులసి .. రోహిణి రీ ఎంట్రీ ఇచ్చారు. నేను కూడా తల్లి పాత్రల ద్వారా రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.


More Telugu News